తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్లు... మావోయిస్టులకు నగదు అందించేందుకు వెళ్తుండగా మహారాష్ట్రలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 2కోట్ల 20లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కాంట్రాక్టర్లతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు - naxals latest news
![తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు telangana contractors booked in gadchiroli for providing cash to naxals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7469340-951-7469340-1591248718354.jpg)
10:59 June 04
తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు
తెలంగాణ నుంచి వచ్చిన ఓ అనుమానాస్పద కారును మహారాష్ట్ర సిరోంచా పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తోన్న రూ.2 కోట్ల 20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కాంట్రాక్టర్లతోపాటు డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్చిరోలిలోని నక్సల్స్‌కు సాయం అందిస్తున్నట్లు వారిపై అభియోగాలు ఉన్నాయి.
ఓ కాంట్రాక్టర్ నుంచి అవతారే, రౌత్ డబ్బులు సేకరించి నక్సల్స్‌కు అందిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు సిరోంచా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చదవండి: