ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ఎత్తు తగ్గించాలి- జగన్ ఒప్పుకున్నారు: కేసీఆర్ - KRISHNA GODAVARI LINK

పోలవరం ప్రాజెక్టు ఎత్తు కాస్త తగ్గిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎత్తు తగ్గిస్తే.. పొరుగు రాష్ట్రాలు ప్రాజెక్టుకు సహకరిస్తాయని.. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహనరెడ్డి కూడా సుముఖంగానే ఉన్నారని కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో చెప్పారు

kcr

By

Published : Sep 16, 2019, 12:02 PM IST

పోలవరం ఎత్తు తగ్గించాలి-

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలవరం ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కాస్త తగ్గిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ముంపు ప్రాంతాలు పెరగడం వల్లనే తెలంగాణ, ఒడీశా నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని ఎత్తు తగ్గిస్తే.. రెండు రాష్ట్లాలు సహకరిస్తాయన్నారు.

జగన్ సుముఖం
ఈ విషయంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​మెహనరెడ్డితో చర్చించానన్న కేసీఆర్ ఎత్తు తగ్గింపునకు ఆయన సుముఖంగానే ఉన్నట్లు చెప్పారు. మహరాష్ట్రతో తాము జలవివాదాలు పరిష్కరించుకున్నట్లుగా ఏపీ కూడా పొరుగురాష్ట్రాలతో వివాదాలు పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. గోదావరి నీటిని నాగార్జున సాగర్​కు తరలించే ప్రాజెక్టుపై అధ్యయనం జరుగుతోందని రెండు రాష్ట్రాలు కలిసి కృష్ణా-గోదావరి అనుసంధానంపై దృష్టి పెట్టాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details