సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్‌డౌన్‌పై సమావేశంలో చర్చించనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా.. కరోనా వ్యాప్తి తగ్గడం లేదని, సరైన ఫలితాలు లేవని నివేదికలు అందుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని వర్గాలు లాక్‌డౌన్ కావాలని కోరుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధిస్తే వచ్చే సాదకబాధకాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చిస్తారు. అన్ని అంశాలపై చర్చించి లాక్‌డౌన్‌పై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.