ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Koushik Reddy: నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి! - నామినేటెడ్‌ ఎమ్మెల్సీ

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్​ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌కు సిఫారసు చేసింది.

పాడి కౌశిక్‌రెడ్డి
పాడి కౌశిక్‌రెడ్డి

By

Published : Aug 1, 2021, 11:01 PM IST

హుజూరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాజకీయం కీలక మలుపులు తీసుకుంటోంది. ఇటీవలే ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరగా నామినేటెడ్‌ ఎమ్మెల్సీ ఆ పార్టీ అవకాశం కల్పించింది. పాడి కౌశిక్‌రెడ్డి పేరును తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్​ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌కు సిఫారసు చేసింది.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవలే తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ‘తెరాస టికెట్‌ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ’ బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు. అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details