తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ ఏడాది పద్దు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
అనతికాలంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రూ.2,56,958,51 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం - రూ.1.89 లక్షల కోట్లు, క్యాపిటల్ వ్యయం - రూ.29,728 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోందని అన్నారు. అవినీతిరహితంగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దరఖాస్తు పెట్టాల్సిన పని లేకుండానే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు.