Bandi Sanjay Letter To KCR: తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల వేధింపులు నిత్యకృత్యంగా మారాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. వారిలో మనోధైర్యం నింపి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీసును క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ రాశారు.
తెలంగాణ సీఎంకు బండి సంజయ్ లేఖ.. ఎందుకంటే..? - ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay Letter To KCR: పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీసును క్రమబద్దీకరించాలని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Bandi Sanjay Letter To KCR
గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ, దోమల నివారణ సహా పలు కార్యక్రమాలు వీరి చేతులమీదుగానే జరుగుతాయి. ఈ సమయంలో వారికి కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :Tidco Houses: టిడ్కో ఇళ్లపై సీఎం జగన్ మాటతప్పి మడమ తిప్పారు: తెదేపా