ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana BJP MLAs: శాసనసభ నుంచి భాజపా సభ్యుల సస్పెన్షన్‌ - telangana budget sessions 2022

Telangana BJP MLAs: తెలంగాణ శాసనసభ బడ్జెట్​ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. తొలిరోజు బడ్జెట్​ ప్రవేశపెడుతుండగా భాజపా నేతలు అడ్డుతగులుతున్నారని సభ నుంచి సస్పెండ్​ చేశారు.

bjp suspend
bjp suspend

By

Published : Mar 7, 2022, 12:48 PM IST

Telangana Budget Session: శాసనసభ బడ్జెట్​ సమావేశాల తొలిరోజునే అనూహ్య సంఘటన చోటుచేసుకొంది. శాసన సభలో మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్​, రఘునందర్​రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్​ చేసింది.

భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్​ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్​ చేస్తున్నట్లు వెల్లడించారు. సభ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.

అసెంబ్లీ ఆవరణలో ధర్నా

ప్రభుత్వ తీరుపై భాజపా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వతీరును నిరసిస్తూ.. అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. వారికి నచ్చజెప్పేందుకు అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు యత్నిస్తున్నారు. చివరకు ముందుగా రాజాసింగ్, రఘునందన్ రావును మార్షల్స్ బయటకు తరలించారు. ఆ తరువాత ఈటలను కూడా బయటకు తరలించారు.

Telangana BJP MLAs: శాసనసభ సమావేశాల నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. శాసనసభలో విధానపరమైన నిర్ణయాలపైనే ప్రసంగం ఉంటుందని చెప్పారు. 50 ఏళ్ల నుంచి వస్తున్న విధానాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదని ముక్తకంఠంతో అన్నారు.

BJP MLAs About Assembly Sessions: స్పీకర్‌ కుర్చీని అడ్డుపెట్టుకుని మైకులు కట్ చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ గంటల తరబడి మాట్లాడారని.. ఇప్పుడు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

"భాజపా ఎమ్మెల్యేలు ముగ్గురమే ఉన్నాం. రాష్ట్ర ప్రజలంతా మావైపే ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తుతాం. అవకాశం ఇవ్వకపోతే ప్రజలతో కలిసి పోరాడతాం. శాసనసభను కేసీఆర్ కించపరుస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గ్లలీ నుంచి దిల్లీ వరకు పోరాటం సాగిస్తాం" - తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు

  • ఇదీ చదవండి :

డాక్టర్​ ఒకటి రాసిస్తే.. షాపువాడు మరొకటి ఇచ్చాడు.. చివరకు

ABOUT THE AUTHOR

...view details