ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్​ సస్పెన్షన్​, షోకాజ్​ నోటీసు - భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సస్పెండ్

రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం
రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం

By

Published : Aug 23, 2022, 3:03 PM IST

Updated : Aug 23, 2022, 3:52 PM IST

15:01 August 23

రాజాసింగ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆగ్రహం

రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం

BJP suspends MLA Raja Singh: ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణలో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది.

ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు పేర్కొంది. వచ్చే నెల 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది.

ఇవీ చూడండి

Last Updated : Aug 23, 2022, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details