ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

28 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు.. 9న రెవెన్యూ బిల్లు - స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి అధ్యక్షతన శాసనసభ బీఏసీ భేటీ

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 28 వరకు 18 పని దినాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవు ప్రకటించింది.

telangana-assembly-bac-meeting-started-under-speckar-pocharam
28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు.

By

Published : Sep 7, 2020, 7:36 PM IST

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 28 వరకు 18 పనిదినాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవు ప్రకటించింది. గంట పాటు ప్రశ్నోత్తరాల సమయానికి కేటాయించారు. ఇందులో ఆరు ప్రశ్నలకే అనుమతి ఇవ్వాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అరగంట పాటు జీరో అవర్ ఉంటుంది. ఈనెల 28న బీఏసీ మరోసారి సమావేశం కానుంది.

ఈనెల 9న రెవెన్యూ బిల్లు..

రేపు పీవీ శతజయంతి ఉత్సవాలపై చర్చ, తీర్మానాలు చేయనున్నారు. ఈనెల 9న కరోనాపై చర్చ జరగనుంది. అదే రోజు రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈనెల 10, 11న కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించనున్నారు. బిల్లుల ఆమోదం కోసం సాయంత్రం వేళలో సమావేశాలను నిర్వహించనున్నారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీలో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ ​రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అన్​లాక్-4: ఈ నెల 21 నుంచి విద్యాలయాలకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details