తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 2 లక్షల 30వేల 825.96 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు పెద్దపీట వేశారు. వ్యవసాయానికి రూ.25 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈ పద్దుపై అధికార తెరాస ప్రశంసల జల్లు కురిపించగా.. ఎప్పటిలాగానే విపక్షం అంకెల గారడీగా పేర్కొంది.
ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్ర అప్పు రూ.రెండు లక్షలా 86వేల కోట్లకు చేరనుందని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. రెండు లక్షలా 45వేల కోట్ల రుణం ఉండనుండగా రానున్న ఏడాది మరో రూ.47వేల కోట్ల అప్పును ప్రభుత్వం ప్రతిపాదించింది.