ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ, తెలంగాణ విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం భేటీ - Telangana, AP Division Dispute Resolution Subcommittee meet

Telangana-AP
Telangana-AP

By

Published : Feb 17, 2022, 11:13 AM IST

Updated : Feb 17, 2022, 12:04 PM IST

11:12 February 17

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఉపసంఘం భేటీ

AP- Telangana bifurcation Issues Subcommittee Meet : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ​ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం... తొలిసారిగా ఇవాళ భేటీ అయింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ సమావేశానికి.. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్​ఎస్​ రావత్ హాజరయ్యారు. ఇవాళ ఉదయం11 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా భేటీ ప్రారంభమైంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన వివాదాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా 5 అంశాలను సమావేశ అజెండాలో చేర్చిన ఉపసంఘం... ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సివిల్‌ సప్లయ్‌ ఆర్థిక అంశాలపై చర్చిస్తారు. ఏపీ జెన్‌కో సంస్థకు తెలంగాణ డిస్కంల బకాయిలు... పన్నుల విధానం, బ్యాంకు డిపాజిట్లు, నగదు పంపకాల అంశాలు కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌

Last Updated : Feb 17, 2022, 12:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details