OMC case: ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు - cases on ias srilaxmi
OMC case
16:45 September 21
ఓఎంసీ కేసు
ఓబుళాపురం గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఓబుళాపురం గనులకు సంబంధించి సరిహద్దు వివాదం తేలే వరకు సీబీఐ కోర్టులో విచారణ నిలిపి వేయాలని కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాకే అభియోగాలు నమోదు చేయాలని శ్రీలక్ష్మి కోరారు. ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ లిఖితపూర్వకంగా ధర్మాసనానికి తెలిపింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.
ఇదీ చదవండి:
OMC Case: శ్రీలక్ష్మి పిటిషన్ పై విచారణ.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ
Last Updated : Sep 21, 2021, 5:18 PM IST