ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2021, 11:22 PM IST

Updated : Jun 17, 2021, 6:24 AM IST

ETV Bharat / city

MP Raghurama case: గుంటూరు జిల్లా జైలు అధికారులకు సీఐడీ కోర్టు మెమో!

MP raghuram
MP raghuram

23:18 June 16

ఎంపీ రఘురామకృష్ణరాజు నుంచి సొంత పూచీకత్తు తీసుకునే విషయంలో... గుంటూరు జిల్లా జైలు అధికారులకు సీఐడీ కోర్టు న్యాయమూర్తి అరుణ మెమో జారీ చేసినట్లు తెలిసింది. రఘురామకృష్ణరాజును రాజద్రోహం, ఇతర నేరారోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు మే 14న హైదరాబాద్‌లో అరెస్టు చేయగా 21న సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. పరీక్షల కోసం సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో ఉన్న ఎంపీ విడుదలైన 10 రోజుల్లోగా ఆయన రూ.లక్ష సొంత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అంతే మొత్తానికి జామీను ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 

గత నెల 26న సైనిక ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అనంతరం దిల్లీలో ఎయిమ్స్‌లో చికిత్స పొందడానికి ఎంపీ వెళ్లారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన తరఫున ఇద్దరు రూ.లక్షకు జామీను ఇవ్వడంతో సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆ పత్రాలను ఆమోదించారు. ఎంపీ నుంచి వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని జిల్లా జైలు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జైలు అధికారులు జామీను పత్రాలను సైనిక ఆసుపత్రికి పంపగా వారు వాటిని తిప్పి పంపారు. తమ దగ్గర ఎంపీ లేరని, ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని వారు బదులిచ్చారు. ఆ ఉత్తర్వులను జైలు అధికారులు సీఐడీ కోర్టులో దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు పరచకుండా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఎంపీ దగ్గర డిశ్ఛార్జి సమయంలో సొంత పూచీకత్తు తీసుకోకపోవడం, ఆ తర్వాతా ఆయన దగ్గర నుంచి పూచీకత్తుకు జైలు అధికారులు ప్రయత్నించకపోవడంతో రెండు రోజుల కిందట సీఐడీ కోర్టు న్యాయమూర్తి అరుణ మెమో జారీ చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

IAS Sri Lakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సూపర్ టైమ్‌స్కేల్‌ పదోన్నతి..ప్రభుత్వం ఉత్తర్వులు!

Last Updated : Jun 17, 2021, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details