Machhakund Hydroelectric Project :ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పవర్‌గేట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. డుడుమ జలాశయంలోని డైవర్షన్ డ్యాం వద్ద రెండో నంబర్ పవర్ గేట్‌లో సమస్య ఏర్పడటంతో భారీ స్థాయిలో వరదనీరు కెనాల్ మీది నుంచి పొంగిపొర్లుతోంది. దీంతో విద్యుత్ కేంద్రానికి నీరు చేరవేసే కెనాల్‌కు ప్రమాదం పొంచి ఉంది. వెంటనే అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం సాంకేతికలోపం తలెత్తిన పవర్‌గేట్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు.
‘మాచ్‌ఖండ్’లో సాంకేతికలోపం.. పొంగిపొర్లుతున్న వరద - technical issue in machkand hydro electric project
Machhakund Hydroelectric Project : మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో సాంకేతికలోపం తలెత్తింది. పవర్ గేట్‌లో సమస్య ఏర్పడటంతో భారీ స్థాయిలో వరదనీరు కెనాల్ మీది నుంచి పొంగిపొర్లుతోంది.
technical issue in machkand hydro electric project