పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్ -2021 దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. ఈ దరఖాస్తులకు సంబంధించి గడువును కూడా పెంచినట్టు వివరించారు. సెప్టెంబరు 1 తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
polycet-2021: సెప్టెంబరు 1న పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - పాలిసెట్
సెప్టెంబరు 1న పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష
19:01 August 12
Polytechnic Joint Entrance Examination on September 1
ఈ పరీక్ష కోసం ఈ నెల 18 తేదీ వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండో షిప్ట్ పాలిటెక్నిక్ కోర్సులకు సంబంధించి ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యా, శిక్షణా మండలి తెలిపింది.
ఇదీ చదవండి:
AMIT SHAH: శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్రహోంమంత్రి.. కుటుంబీకులతో సందర్శన
Last Updated : Aug 12, 2021, 8:01 PM IST