ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. డిపోకే పరిమితమైన బస్సులు... - TSRTC SAMME NEWS

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నేటి నుంచి సమ్మెకు దిగాయి. మూడు దశలుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవ్వగా... ఈ నిర్ణయం తీసుకున్నాయి. కార్మిక సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్​... ఇక చర్చలు జరుపవద్దని నిర్ణయించారు. సమ్మె వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యామ్మాయ చర్యలపై దృష్టిసారించారు.

tealangana-rtc-samme-started-dot-dot-dot-buses-holds-in-depots

By

Published : Oct 5, 2019, 6:44 AM IST

Updated : Oct 5, 2019, 7:54 AM IST


నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఆర్టీసీ సంఘాలతో ఐఏఎస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వంలో కనిపించడం లేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె యథాతథంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ఎస్మా చట్టాలకు భయపడవద్దని కార్మికులకు సూచించారు. సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు. ఉదయం నుంచి కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు ఇబ్బంది కలగనివ్వం...

ఆర్టీసీ సంఘాల సమ్మె నిర్ణయాన్ని త్రిసభ్య కమిటీ తప్పుపట్టింది. అధ్యయనం చేయకుండానే విలీనం కోసం హామీ ఇవ్వడం సరికాదని పేర్కొంది. ప్రత్నామ్నాయాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. 2,100 అద్దె బస్సులు, పాఠశాల బస్సులు నడుపుతామని వెల్లడించింది. అలాగే 3 వేల మంది డ్రైవర్లను తాత్కాలికంగా నియామించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బస్సులు నడిపేందుకు భద్రత కల్పించాలని కలెక్టర్లు, ఎస్పీలకు కమిటీ ఆదేశించింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ...

ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యం కావటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎర్రమంజిల్ రోడ్లు భవనాలుశాఖ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.

ఇవీ చూడండి: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె​: ప్రత్యామ్నాయాలపై అధికారుల కసరత్తు

Last Updated : Oct 5, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details