ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ బదిలీలను నవంబర్ రెండో తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్ త్వరలో విడుదల చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నందున హేతుబద్ధీకరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడుతో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రతినిధులు సమావేశమై పలు అంశాలు చర్చించారు.
ఉపాధ్యాయుల బదిలీలు వాయిదా - ఉపాధ్యాయులు బదిలీ వాయిదా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్న కారణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ బదిలీలను విద్యాశాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. నవంబర్ రెండో తేదీ వరకు ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 31వ తేదీ వరకు ఉండే విద్యార్థుల ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకుని హేతుబద్ధీకరణ, బదిలీలను చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య విన్నవించింది. ఇందుకనుగుణంగా కొత్త విద్యార్థుల ప్రవేశాలు, ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారు, ప్రభుత్వ పాఠశాలల నుంచి వేరే పాఠశాలలకు వెళ్లిన వారి వివరాలను నవంబర్ రెండో తేదీ నాటికి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రకటించనున్నారు.
ఇదీ చదవండి :పేకాట శిబిరంపై పోలీసుల దాడి... భవనం పైనుంచి దూకి ఒకరు మృతి