ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయుల చూపు.. బదిలీల వైపు..! - Teachers Transfers in ap news

ఉపాధ్యాయ బదిలీలకు 75వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 24వేల మందికి తప్పనిసరి బదిలీ కానుంది. జిల్లాల వారీగా 1,2,3, కేటగిరీలో ఖాళీ పోస్టులను బ్లాక్ చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఈ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.

Teachers Transfers ongoing in Andhra Pradesh
బదిలీల వైపు.. ఉపాధ్యాయుల చూపు..!

By

Published : Nov 17, 2020, 10:56 PM IST

ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర వ్యాప్తంగా 75,718మంది దరఖాస్తు చేశారు. వీరిలో తప్పనిసరి బదిలీ అయ్యేవారు 24,535మంది ఉండగా.. రెండేళ్లు పూర్తి చేసుకొని అభ్యర్థన బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు 51,183మంది ఉన్నారు. దరఖాస్తుల పరిశీలన ఇవాళ రాత్రి వరకు నిర్వహించనున్నారు. దరఖాస్తుల పరిశీలన కోసం ఉపాధ్యాయులను కార్యాలయాలకు పిలిపించకూడదని, ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయొద్దంటూ పాఠశాల విద్య కమిషనరేట్‌ ఆదేశాలు జారీ చేసింది.

ప్రాథమిక సీనియారిటీ జాబితాను 19నుంచి 23వరకు జిల్లాల వారీగా అందుబాటులో ఉంచనున్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు సమీపంలో పనిచేస్తున్న వారిలో దాదాపు 10వేల మంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కేటగిరి-3, 4లోని బడులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసిన వారిలో సుమారు 8 వేల మంది హేతుబద్దీకరణ కారణంగా పోస్టు కోల్పోయిన వారు ఉన్నారు.

బదిలీల్లో భాగంగా అయా జిల్లాల్లో కొన్ని పోస్టులను బ్లాక్‌ చేయనున్నారు. ఒక జిల్లాకు మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు, ప్రస్తుతం పని చేస్తున్న వారికి మధ్య ఉండే వ్యత్యాసం పోస్టులను బ్లాక్‌ చేస్తారు. ఇలా బ్లాక్‌ చేసే పోస్టులు ఎక్కువగా కేటగిరి-1,2,3ల్లో ఉండనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు వరకు రెండు పోస్టులు ఇచ్చారు. ఇలాంటి వాటిల్లో 20లోపు విద్యార్థులు ఉంటే ఒకటి బ్లాక్‌ చేసే అవకాశం ఉంది.

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఖాళీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఉపాధ్యాయ ఖాళీలపై జిల్లా విద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు. పాఠశాలల ఎంపికకు డిసెంబరు 3వరకు సమయం ఉన్నందున అప్పటిలోపు ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.

ఇదీ చదవండీ... వైఎస్​ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు

ABOUT THE AUTHOR

...view details