'నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా పునర్నియమించడం తప్ప ప్రత్యామ్నాయం లేదు' - యనమల రామకృష్ణుడు లేటెస్ట్ న్యూస్
నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా పునర్నియమించాలనే న్యాయస్థానాల తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సూచించారు.
'నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా పునర్నియమించడం తప్ప ప్రత్యామ్నాయం లేదు'
హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పునర్నియమించటం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ప్రత్యామ్నాయం లేదని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్థించిందని ఆయన గుర్తు చేశారు. న్యాయస్థానం నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలని యనమల ఆకాంక్షించారు.