ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపాలని జాతీయ మహిళా కమిషన్‌కు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ(Letter) రాశారు. కమిషన్ చర్యలు రాష్ట్ర మహిళల్లో విశ్వాసాన్ని పెంచటంతో పాటు దాడుల్ని అరికట్టేలా ఉండాలని కోరారు. రెండేళ్లగా రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని లేఖలో వివరించారు. నేరస్థుల్ని ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. పార్టీ రంగులతో ప్రచారం చేసుకునేందుకు తప్ప దిశ చట్టం, పోలీసు స్టేషన్లు, మొబైల్ వాహనాలు, యాప్ లతో ఉపయోగం లేదని దుయ్యబట్టారు. ఈ నెల 19న సీతానగరం వద్ద యువతిపై అత్యాచారం ఘటన మరువక ముందే 22వ తేదీన మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో ఎస్సీ మహిళ మరియమ్మ అనుమానాస్పద మృతి జరిగిందన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేస్తే మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
LETTER : జాతీయ మహిళా కమిషన్‌కు తెదేపా మహిళా అధ్యక్షురాలు అనిత లేఖ
ఏపీలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలపై తెదేపా మహిళా అధ్యక్షురాలు అనిత.. జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ(Letter) రాశారు. రాష్ట్రంలో మహిళలపై దాడుల గురించి తెలుసుకుని.. విచారణ చేసేందుకు బృందాన్ని పంపాలని కోరారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు.
TDP women president Anita
TAGGED:
anitha letter taza