TDP WOMENS PROTEST: కల్తీ మద్యాన్ని నియంత్రించడమే కాకుండా..సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ తెలుగు మహిళలు రోడ్డెక్కారు. విశాఖలో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మద్యపాన నిషేధం పేరుతో బార్ లైసెన్స్ లు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మద్యం ధరలు పెంచి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటుందంటూ .. కృష్ణా జిల్లా గన్నవరంలో జాతీయ రహదారిపై తెలుగు మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్డుపై బైఠాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల హామీ ప్రకారం సీఎం మద్యపాన నిషేధం అమలు చేసేవరకూ పోరాటం చేస్తామని కర్నూలు తెలుగు మహిళలు హెచ్చరించారు.