రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. . కొవిడ్ విబంధనలు పాటిస్తూ.. ఇళ్లలోనే పండుగను జరుపుకోవాలని అన్నారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు గణనాథుడని.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దామని చెప్పారు.
దేశంలో విశిష్టత కలిగిన పండగ వినాయక చవితి అని అచ్చెన్నాయుడు అన్నారు. పర్యావరణ రక్షణకు మట్టి వినాయకులను పూజించాలని ప్రజలను ఆయన కోరారు.