తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ - ఏపీ తాజా వార్తలు
15:46 October 01
టైలర్ హాబ్స్ పేరిట హ్యాక్‌కు గురైన తెదేపా ట్విటర్ ఖాతా
తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. టైలర్ హాబ్స్ పేరిట అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ ఖాతాలో తెదేపా పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్‌కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను అధికార వైకాపా మద్దతు ఉన్న దుష్ట శక్తులు హ్యాకింగ్ చేశాయని తెదేపా ఆరోపించింది. దీనిపై ఫిర్యాదు చేసినందున కాసేపట్లోనే తిరిగి పునరుద్దరించబడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి: