పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభలో మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో కూడా మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ...‘‘పౌరసత్వంపై గతంలో అనేక మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. బంగ్లాదేశ్ ముస్లింల చొరబాటుపై 2007లో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారు. ఈ బిల్లుకు మద్దతిస్తున్నాం..కానీ దీనిపై మాకు కొన్ని వివరణలు కావాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు తెదేపా మద్దతు - citizenship ammendment bill news
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. బిల్లుకు మద్దతిస్తున్నామని...కానీ తమకు కొన్ని వివరణ కావాలని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
tdp-support-to-citizenship-ammendment-bill-in-rajyasabha
ఇదీ చదవండి : వివాదాస్పద 'పౌర' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం