ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా తెదేపా కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Dec 25, 2019, 4:45 AM IST

Updated : Dec 25, 2019, 10:28 AM IST

అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా తెదేపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా మైలవరంలో పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో రాజధాని రైతులకు మద్దతుగా సాగిన ర్యాలీలో తెదేపా నేత  దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. రైతుల త్యాగాలను హేళన చేయవద్దని హితవు పలికారు.

tdp-support-amaravathi-formers-and-arrested-in-candle-rally
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలు

రాజధాని ప్రాంత రైతుల పోరాటానికి తెదేపా మద్దతు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల చేస్తున్న పోరాటానికి మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేతలు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. 3 రాజధానుల ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని నినదించారు. రైతుల త్యాగాలను గుర్తించి వారికి న్యాయం చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

మాట తప్పి మడం తిప్పారు....

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. యువనేత నారా లోకేశ్​ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినదించారు. అధికారంలోకి రాగానే జగన్ మాట తప్పి మడం తిప్పారని లోకేశ్‌ విమర్శించారు.

ర్యాలీలో ఉద్రిక్తత...

అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా కృష్ణా జిల్లా మైలవరంలో తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజధాని మార్పు ప్రతిపాదనలను నిరసిస్తూ విజయవాడ నగరంలో తెదేపా ప్రదర్శన చేపట్టింది. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధ వెంకన్న రాజధాని రైతులకు మద్దతుగా నినదించారు. ర్యాలీ చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్తత ఏర్పడింది.

నక్కా ఆనందబాబు సవాల్...

మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలంటూ గుంటూరులో నిర్వహించిన కాగడాల ప్రదర్శనలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్​ చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగితే న్యాయ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.

విశాఖలో రాజధాని వెనుక వైకాపా నాయకులు స్వప్రయోజనాలే ఉన్నాయని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అమరావతి రైతులకు న్యాయం చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:

'అమరావతిని ముంచింది వరద కాదు... వైకాపా'

Last Updated : Dec 25, 2019, 10:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details