ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విద్యుత్ ఛార్జీలు పెంచడమే వైకాపా రాజన్న రాజ్యమా?' - విద్యుత్ ఛార్జీలపై మాట్లాడిన తెదేపా నాయకుడు కాకి గోవిందరెడ్డి

గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజల్ని వేధిస్తున్నారని.. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. ప్రజల కష్టాన్ని దోచుకునే బందిపోటు ప్రభుత్వం వైకాపాది అని దుయ్యబట్టారు.

TDP leader Kaki Govindareddy
తెదేపా నాయకుడు కాకి గోవిందరెడ్డి

By

Published : Apr 12, 2021, 11:46 AM IST

రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. వైకాపా వచ్చాక ప్రజలపై విద్యుత్ భారాన్ని 40 వేల కోట్ల రూపాయలు చేసిందన్నారు. తెదేపా హయాంలో 200 రూపాయల బిల్లు వస్తే.. నేడు 2వేల రూపాయలు వస్తోందని మండిపడ్డారు.

గతేడాది స్లాబుల పేరుతో మాయ చేసి రూ. 1500 కోట్లు భారం ప్రజలపై మోపారని విమర్శించారు. రెండేళ్ల పాలనలో 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే.. వైకాపా రాజన్న రాజ్యమా అని నిలదీశారు. తిరుపతి ఉపఎన్నికలో వైకాపాని ఓడిస్తేనే ప్రజలంటే వైకాపాకి భయం పుట్టుకొస్తుందని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details