ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజీనామా చేయండి.. ఫ్లాప్ షోనా.. బ్లాక్ బస్టరా అన్నది జనం తేలుస్తారు' - అమరావతి ఉద్యమం వార్తలు

వైకాపా నేతలపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజీనామా చేసి వస్తే అమరావతి ఉద్యమం ఫ్లాప్ షోనా.. బ్లాక్ బస్టరో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

TDP spokesperson Pattabhi criticizes ycp leaders
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

By

Published : Oct 13, 2020, 3:00 PM IST

రాజధాని అంశంపై చంద్రబాబు సవాల్ మేరకు వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అమరావతి ఉద్యమం ఫ్లాప్ షో నో లేక బ్లాక్ బాస్టరో ప్రజలే తేలుస్తారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల.. అమరావతి ఉద్యమం పట్ల కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆర్ఆర్ గ్లోబల్స్, ఓబుళాపురం మైనింగ్, ఈశ్వర్ సిమెంట్స్, చీప్ లిక్కర్ మాఫియా అంశాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సజ్జల చరిత్ర ఒక్కొక్కటిగా బయటపెడతామని... తనకు తాను అపర మేధావిగా భావించుకోవటం తగదని హితవు పలికారు.

జగన్ ఏ ఉద్యమాలు చేశారు?

ఏడాది పాటు జగన్ పాదయాత్ర పేరుతో చేసిన వీధి నాటకం ప్రజలకు అర్ధమవుతోందన్నారు. విద్యార్థి నాయకుడిగానే చంద్రబాబు ఎన్నో ఉద్యమాలు చేశారని కొనియాడారు. మనీ ల్యాండరింగ్, సూట్ కేసు కంపెనీలు లాంటివి జగన్ చేసిన ఉద్యమాలా అంటూ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టుల్లో సీఐడీ విఫలమైంది కాబట్టే సీబీఐకి అప్పగించారని పట్టాభి ఎద్దేవా చేశారు. తాను జైలుకెళ్తాడని అర్ధమయ్యే ప్రజల్లో సానుభూతి కోసం జగన్ ముందస్తు కుట్రలు పన్నుతున్నారని పట్టాభి దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:మంత్రి బొత్స ఇంటికి వెళ్లేందుకు విద్యార్థు యత్నం... నాయకుల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details