ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి కొడాలి నానిపై కేసు పెట్టే ధైర్యం లేదా?: పట్టాభి - పోలీసుల వైఖరిపై పట్టాభి మండిపాటు

చంద్రబాబు పట్ల పోలీసుల వైఖరిపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కీలక వ్యాఖ్యలు చేశారు. మత సామరస్యాన్ని కాపాడి, దేవాలయాలపై దాడులు అరికట్టమని చంద్రబాబు కోరటం ఆయన చేసిన నేరమా అని పోలీసుల్ని పట్టాభి ప్రశ్నించారు.

TDP spokesperson Pattabhi
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

By

Published : Jan 8, 2021, 8:10 AM IST

మత సామరస్యాన్ని కాపాడి, దేవాలయాలపై దాడులు అరికట్టమని చంద్రబాబు కోరటం ఆయన చేసిన నేరమా అని పోలీసుల్ని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి నిలదీశారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టారంటూ తెలుగుదేశం అధినేతపై కేసు పెడతామంటారా అని ధ్వజమెత్తారు. విగ్రహాల ధ్వంసంపై మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే డీజీపీకి మతసామరస్యం గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినానిపై కేసు నమోదు చేయటానికి ధైర్యం సరిపోలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సీతమ్మవారి విగ్రహాన్ని ఎలుకలు ధ్వంసం చేశాయని అవహేళనగా మాట్లాడిన పోలీసు అధికారులకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. వైకాపా ఎమ్మెల్యేలు పోలీసుల్ని నోటికొచ్చినట్లు దూషిస్తుంటే.. పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తోందని పట్టాభి నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే పోలీసులను మాత్రమే తాము తప్పుపడుతున్నామనీ... నిజాయితీపరులను కాదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కృష్ణాతీరంలో దేవాలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details