ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏ1, ఏ2ల పైశాచికత్వం పరాకాష్టకు చేరుతోంది: పట్టాభి - visakha geetham university news

గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పందించారు. ఏ1,ఏ2ల పైశాచికత్వం పరాకాష్టకు చేరుతోందని ఆరోపించారు.

TDP spokesperson Kommareddy Pattabhi
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

By

Published : Oct 24, 2020, 1:09 PM IST

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థపై జగన్ ప్రభుత్వం అర్థరాత్రి దాడికి దిగిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. దొంగలముఠా ఏది చేసినా అర్థరాత్రే చేస్తుందని దుయ్యబట్టారు. ఏ1,ఏ2ల పైశాచికత్వం పరాకాష్టకు చేరుతోందని ధ్వజమెత్తారు. తిరుగుటపాలో పారిపోయి వచ్చిన బ్యాచ్​కి విద్యాలయాల పట్ల గౌరవం ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. భరత్​ని రాజకీయంగా ఎదుర్కోలేక దాడి చేశారని పట్టాభి ఆక్షేపించారు. విశాఖలో ఇప్పటికే రాజధాని పేరుతో భూ దందా సాగిస్తూ... 6వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details