రాష్ట్రంలో 5 రోజుల పాటు అడపా దడపా టీకాలు ఇచ్చి..రికార్డు కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. 15నుంచి 19వ తేదీ వరకు నామమాత్ర వ్యాక్సిన్లు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అది 10 శాతం కూడా లేదని విమర్శించారు. రికార్డుల కోసం జనాన్ని పోగేసి కొవిడ్ నిబంధనలు పాటించకుండా క్యూలో నిల్చోపెట్టారని మండిపడ్డారు.
'రికార్డు కోసం కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు' - TDP leader Kommareddy Pattabhi respond on vaccination program
రాష్ట్రంలో 5రోజుల పాటు అందాల్సిన వ్యాక్సిన్లను రికార్డు కోసం హడావిడిగా పూర్తి చేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. నామమాత్రపు వ్యాక్సిన్లతో ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు.

తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి