PATTABHI: తెదేపా ప్రభుత్వ హయాంలో 2018లో స్టార్టప్ ర్యాంకింగ్‌లో లీడర్ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని... ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన రివర్స్ పాలనతో అట్టడుగు స్థానానికి దిగజార్చారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకుల్లో రాష్ట్రాన్ని అధమస్థానంలో నిలిపిన ఘనత జగన్‌రెడ్డిదేనని విలేకర్లతో మాట్లాడుతూ ఆయన దుయ్యబట్టారు. దేశంలోనే మొదటిసారిగా, కేంద్ర ప్రభుత్వం కంటే ముందే 2014లో ఏపీలో చంద్రబాబు స్టార్టప్ పాలసీ తెచ్చారని పట్టాభి తెలిపారు. రాష్ట్ర పనితీరును చూసిన కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లకు ఏపీని మెంటార్‌గా నియమించిందన్నారు. ‘ఏపీలో 259 స్టార్టప్‌లు పనిచేస్తున్నట్టు 2018-19లో విడుదలైన స్టార్టప్ ర్యాంకింగ్స్ నివేదికలో స్పష్టంగా ఉంది. ఆ నివేదిక ప్రకారం... ఏపీ లీడర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021 స్టార్టప్ ర్యాంకింగ్స్‌లో ఏడు ఏరియాల్లో 26 యాక్షన్ పాయింట్లు ఉండగా కేవలం 7 పాయింట్లనే ఏపీ అడ్రస్ చేసిందంటే అంతకంటే అవమానం ఏముంది?’ అని పట్టాభి ధ్వజమెత్తారు. 2018లో తెలంగాణ, గుజరాత్‌లతో పాటు విశాఖలోనే స్టార్టప్ కార్యశాలల్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందని ఆయన గుర్తుచేశారు.
PATTABHI: జగన్‌రెడ్డి వల్లే ‘లీడర్’ నుంచి అథఃపాతాళానికి ఏపీ: పట్టాభిరామ్ - తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
PATTABHI: తెదేపా ప్రభుత్వ హయాంలో స్టార్టప్ ర్యాంకింగ్‌లో లీడర్ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని.. జగన్‌రెడ్డి తన రివర్స్ పాలనతో అట్టడుగు స్థానానికి దిగజార్చారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకుల్లో రాష్ట్రాన్ని అధమస్థానంలో నిలిపిన ఘనత జగన్‌రెడ్డిదేనని విలేకర్లతో మాట్లాడుతూ ఆయన దుయ్యబట్టారు. 2018లో తెలంగాణ, గుజరాత్‌లతో పాటు విశాఖలోనే స్టార్టప్ కార్యశాలల్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందని ఆయన గుర్తుచేశారు.
చంద్రబాబు సంస్కరణల వల్లే..
‘చంద్రబాబు చేపట్టిన సంస్కరణల వల్ల ఏపీకి 2015లో మొదటిసారి సులభతర వాణిజ్యంలో రెండో ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత 2016-17 నుంచి వరుసగా మూడేళ్లు మొదటి స్థానంలో నిలిచింది. 2018-19లో అత్యధికంగా 368 సంస్కరణలు అమలు చేయడం వల్లే ఏపీకి మొదటి ర్యాంకు వచ్చింది. అప్పట్లో చంద్రబాబు చేసిన కృషి వల్లే రాష్ట్రానికి ఇప్పటికీ నం.1 స్థానం వస్తోందే తప్ప, జగన్‌రెడ్డి చేసిన కృషి శూన్యం’ అని పట్టాభి విమర్శించారు. కేంద్ర పరిశ్రమల శాఖకు చెందిన సెక్రటేరియేట్ ఫర్ ఇండస్ట్రియల్ అసిస్టెంట్స్ (ఎస్‌ఐఏ) గణాంకాల ప్రకారం తెదేపా హయాంలో ఐదేళ్లలో రూ.1,26,630 కోట్ల స్వదేశీ పెట్టుబడులు వస్తే, జగన్ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో మొత్తం రూ.37,923 కోట్ల పెట్టుబడులే వచ్చాయన్నారు. 2014-19 మధ్య ఏపీకి రూ.65,327 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే, 2019-22 మధ్య మూడేళ్లలో రూ.3,796 కోట్ల పెట్టుబడులే వచ్చాయని తెలిపారు.
ఇవీ చదవండి: