ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెట్రోలు, డీజిల్​పై అదనపు వ్యాట్​ పెంచడం దారుణం: తెదేపా - Devineni Uma Maheswara Rao

పెట్రోలు, డీజిల్​పై అదనపు వ్యాట్​ పెంచడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. వ్యాట్ పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

additional vat burden on petrol and diesel
additional vat burden on petrol and diesel

By

Published : Jul 21, 2020, 10:43 AM IST

సోమిరెడ్డి ట్వీట్

పెట్రోలు, డీజిల్‌పై అదనపు వ్యాట్ భారం వేయడాన్ని తెదేపా నేతలు ఖండించారు. పెంచిన పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెట్రో ధరలతో అల్లాడుతుంటే ప్రభుత్వం వ్యాట్ భారం రూ.4కి పెంచడం తగదన్నారు. పెట్రోలు, డీజిల్‌పై అదనపు వ్యాట్‌ను రూ.4కు పెంచడం దారుణమని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. పెంచిన వ్యాట్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details