ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగనన్న గొంతు తడి పథకంతో మద్యం దోపిడీ' - tdp leader ayyanna patrudu latest press meet

రాష్ట్ర ప్రభుత్వం మద్యం దోపిడీకి తెరలేపిందని తెదేపా సీనియర్​ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. లాక్​డౌన్​తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. జగన్​ తప్పుడు నిర్ణయాలతో వారిని మరింత కష్టాల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు.

'జగనన్న గొంతుతడి పథకంతో మద్యం దోపిడీ'
'జగనన్న గొంతుతడి పథకంతో మద్యం దోపిడీ'

By

Published : May 6, 2020, 2:57 PM IST

సీఎం జగన్​పై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు

రాష్ట్రంలో జగనన్న గొంతు తడి పథకం ఘనంగా ప్రారంభించి మద్యం దోపిడీకి తెరలేపారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. కరోనా ధాటికి ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికే సమయంలో జగన్​ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆక్షేపించారు. లాక్​డౌన్​ సమయంలో ప్రజలకు అందివ్వాల్సింది నిత్యావసర సరకులు, మందులు తప్ప.. మద్యం కాదన్నది ముఖ్యమంత్రి గ్రహించాలని హితవు పలికారు.

సున్నా వడ్డీతో ఇచ్చిన రూ.1400 కోట్లు వెనక్కు లాక్కోవాలనే ఆలోచనతోనే మద్యం ధరలు పెంచారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పేదల జేబుల్లోంచి రూ.10 వేల కోట్లు లాగాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్​ ఏ నిర్ణయం తీసుకున్నా.. సలహాదారులు ఎందుకు అడ్డు చెప్పడం లేదని నిలదీశారు. సీఎం నిర్ణయాల వల్ల ఏపీలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని.. ప్రధాని మోదీ స్పందించి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details