అమూల్ సంస్థకు రూ.3వేల కోట్లను కట్టబెట్టే బదులు వంద కోట్లతో విజయ డెయిరీని అభివృద్ధి చేయవచ్చని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని డెయిరీలపై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న 20 వరకు సహకార సంఘాల పాల డెయిరీలను కాదని... గుజరాత్‌కు చెందిన అమూల్‌కు ప్రాధాన్యమివ్వడమేంటని ప్రశ్నించారు. పాదయాత్రలో పాడి రైతులకు లీటర్‌కు 4 రూపాయలను బోనస్ ఇస్తామన్న హామీని జగన్ విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారు: సప్తగిరి ప్రసాద్ - tdp sapthagiri prasad on ap-amul project news
రాష్ట్రంలో ఉన్న సహకార సంఘాలను కాదని.. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు ప్రాధాన్యం ఇవ్వడమేంటని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
tdp sapthagiri prasad