ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2019, 6:22 AM IST

ETV Bharat / city

'రాజధాని అమరావతిని కాపాడుకుందాం'

అమరావతి అభివృద్ధికి వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లాలని తెదేపా నిర్ణయించింది. అమరావతి మనుగడ లేకపోతే రాష్ట్ర భవిష్యత్తే ఉండదన్న నినాదంతో పోరుబాటకు తెదేపా సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన.. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, ఎడిటర్లు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Tdp round table meet on amaravathi
'రాజధాని అమరావతిని కాపాడుకుందాం'

దేవినేని ఉమ మీడియా సమావేశం

'రాజధాని అమరావతిని కాపాడుకుందాం' అనే నినాదంతో మరో ఉద్యమ కార్యాచరణకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, న్యాయవాదులు, ఎడిటర్లు, మేధావులను ఆహ్వానించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలు, సలహాలు ఆధారంగా తదుపరి ఉద్యమ ప్రణాళికను ప్రకటించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు.

ప్రజల్ని చైతన్య పరిచేందుకు ప్రణాళిక

రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణపై తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు. రాజధాని అంటూ ఒకటి లేకపోతే మరే నగరం అభివృద్ధి సాధ్యం కాదనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి చైతన్యపరచాలని నేతలకు సూచించారు. అమరావతిని అభివృద్ధి చేస్తూనే విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు వంటి నగరాలు అభివృద్ధి జరగాలన్నది తెదేపా విధానమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

'అమరావతి జోలికి రావొద్దు... రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి'

ABOUT THE AUTHOR

...view details