రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్‌ను కలిసేందుకు వర్ల రామయ్య నేతృత్వంలోని తెదేపా ప్రతినిధుల బృందం సమయం కోరింది. వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేయాలని తెదేపా నిర్ణయించింది. కరోనా సహాయక చర్యల్లో భాగంగా అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, సంబంధిత ఫొటోలు, వీడియోలను ఎన్నికల కమిషనర్‌కు అందిస్తామని నేతలు తెలిపారు. సమయం ఇవ్వాలని ఎస్ఈసీ కార్యాలయాన్ని కోరితే సెలవు అని చెబుతున్నారని అన్నారు.. క్యాంపు ఆఫీస్‌లో అయినా ఎన్నికల కమిషనర్ని కలవడానికి సమయం ఇవ్వాలని కోరితే స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్ఈసీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు: తెదేపా నేతలు - ఏపీ పొలిటికల్ న్యూస్
వైకాపా అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసేందుకు ఎస్ఈసీని కలిసేందుకు సమయం కోరితే ఇవ్వటం లేదని తెదేపా నేతలు ఆరోపించారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పినా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని, సెలవులో ఉన్నారని ఎస్ఈసీ కార్యాలయం సమాధానం ఇస్తుందంటున్నారు.
ఎస్ఈసీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు : తెదేపా నేతలు