ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం' - టీడీపీ బుక్ ఆన్​ వైసీపీ రూలింగ్

వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో  రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుగుదేశం విమర్శించింది. వైకాపా ఆరు నెలల పాలనపై ఆ పార్టీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో రెండంకెల వృద్ధి సాధిస్తే... జగన్‌ సీఎం అయ్యాక  ఆరునెలల్లోనే వృద్ధి రేటు 4 శాతానికి పడిపోయిందని దుయ్యబట్టింది.

Tdp released book on ycp six month ruling
'మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం'

By

Published : Dec 1, 2019, 6:11 AM IST

'మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం'

వైకాపా 6 నెలల పాలనలో.. రాష్ట్రంలోని సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని తెలుగుదేశం ఆరోపించింది. ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోవటంతో పాటు... వైకాపా నేతల అవినీతి పెరిగిపోయిందన్నారు. ఆర్థికశాఖ లెక్కల ప్రకారమే ఈ ఏడాది 21 వేల కోట్లు కొరత ఉందన్నారు. ఒక్క ఏడాదిలోనే అప్పు 62 వేల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు వైకాపా 6 నెలల పాలనపై తెలుగుదేశం పుస్తకాన్ని విడుదల చేసింది.

కక్షసాధింపు చర్యలు

మొత్తం 180 రోజుల పాలనలో 176 వైఫల్యాలను తెలుగుదేశం ఎత్తిచూపింది. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసక పాలనకు జగన్‌ శ్రీకారం చుట్టారని దుయ్యబట్టింది. పథకాల రద్దు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులన్నీ ముడుపుల కోసమే నిలిపేశారని ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి.. కృత్రిమ కొరత సృష్టించారని పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యలే లక్ష్యంగా వైకాపా ఆరు నెలల పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, విధ్వంసాల వల్ల ఇప్పటికే లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.

మాట తప్పారు... మడప తిప్పారు

విద్యుత్ పీపీఏల రద్దుచేయటం వలన కోర్టులు, కేంద్రం, విదేశాల హెచ్చరికలతో రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొచ్చారన్నారు. కాపు రిజర్వేషన్లు రద్దుతో పాటు విదేశీ విద్య, కాపు భవనాల నిర్మాణాలను నిలిపివేశారన్నారు. సన్నబియ్యం విషయంలో మాట తప్పారని విమర్శించారు. జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణపై మడమ తిప్పారని దుయ్యబట్టారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ పోస్టుల్లో అవకతవకలు జరిగాయన్నారు. బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ ఆస్తులు అమ్మెసే కుట్ర, ప్రభుత్వ భూములను కారు చౌకకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి :

'రివర్స్ టెండరింగ్​తో రూ.60 కోట్లు ఆదా'

ABOUT THE AUTHOR

...view details