ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంక్రాంతి వేళ రైతుల ఇంట సంతోషం కరవు: రామానాయుడు - తెదేపా నేత నిమ్మల రామానాయుడు న్యూస్ అప్​డేట్స్

ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకుండా రైతులకు సంక్రాంతి సంతోషాన్ని దూరం చేసిందని తెదేపా నేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పండుగలోపు రైతుల ఖాతాల్లో ధాన్యం బకాయిలు జమచేయకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

tdp ramanaidu comments on farmers in ap
tdp ramanaidu comments on farmers in ap

By

Published : Jan 8, 2021, 3:31 PM IST

ధాన్యం బకాయిలు 2వేల 727 కోట్లు చెల్లించకుండా ప్రభుత్వం రైతుల ఇంట సంక్రాంతి సంతోషాన్ని దూరం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పండుగ రోజు కల్లా ప్రభుత్వం చెల్లింపులు చేయకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. తుపాన్‌లతో 39లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ప్రభుత్వం కేవలం 12 లక్షల ఎకరాలకు మాత్రమే పెట్టుబడి రాయితీ అందించేలా ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. గతంలో ఉన్న 20వేల రూపాయల పెట్టుబడి రాయితీ సాయాన్ని 15వేలకు కుదించారన్నారు. 6వేల కోట్ల పెట్టుబడిరాయితీకి కేవలం 601 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించందన్నారు.

జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలు బకాయిలు

  • పశ్చిమగోదావరి జిల్లా- రూ. 881కోట్లు
  • తూర్పుగోదావరి జిల్లా- రూ. 771.91కోట్లు
  • కృష్ణ - రూ. 431.59కోట్లు
  • విజయనగరం - రూ. 288.24కోట్లు
  • గుంటూరు - రూ. 40.06కోట్లు
  • విశాఖ - రూ. 4.66కోట్లు
  • ప్రకాశం - రూ. 3.07కోట్లు
  • అనంతపురం - రూ. 2.79కోట్లు
  • కడప - రూ. 1.34కోట్లు

ఇదీ చదవండి:బ్రిస్బేన్​లో లాక్​డౌన్.. నాలుగో టెస్టుపై నీలినీడలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details