అమరావతి రైతుల అరెస్టులు, చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ..గుంటూరులో తెదేపా నేతలు నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చేతులకు తాళ్లతో కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు ఆనందబాబు అన్నారు. అమరావతి ఉద్యమాన్ని అణిచివేయడానికి పెయిడ్ అర్టిస్టులతో ఉద్యమానికి చేయిస్తోందని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిన అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు పోరాటం ఆగదని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.
రైతులకు సంకెళ్లు సిగ్గుచేటు: ఆనందబాబు - tdp protest news
రాజధాని రైతులకు సంకెళ్లు వేయడంపై..తెలుగుదేశం నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైకాపా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చేతులకు తాళ్లతో కట్టుకుని నిరసన తెలిపారు.
తెదేపానేతల నిరసన దీక్ష