ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కల్తీ సారా, జె- బ్రాండ్స్​కు వ్యతిరేకంగా.. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసనలు - తెదేపా వార్తలు

కల్తీ సారా, జె- బ్రాండ్స్ మద్యానికి వ్యతిరేకంగా నేడు, రేపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమైంది.మద్యపాన నిషేధం చేస్తాం అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ మాట తప్పి, మడమ తిప్పారని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని బలితీసుకుంటుందని ఆరోపించారు.

Tdp
Tdp

By

Published : Mar 19, 2022, 5:21 AM IST

'కల్తీ సారా అరికట్టాలి, జె. బ్రాండ్స్ మద్యం నిషేధించాలి' అనే డిమాండ్ తో నేటి నుంచి రెండు రోజుల పాటు.... తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమైంది. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ..పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టనున్నారు. మద్యపాన నిషేధం చేస్తాం అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ మాట తప్పి, మడమ తిప్పారని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని బలితీసుకుంటుందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను ఏపీలో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details