వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా లేక రాక్షసులు పాలిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందంటూ ధ్వజమెత్తారు. బెయిల్‌పై విడుదలైన మాజీ ఎమ్మల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని 24 గంటలు గడవకముందే... అక్రమ కేసులు పెట్టి మీళ్లీ అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అధికారం శాశ్వతం కాదని సీఎం జగన్ గుర్తుంచుకోవాలి: కళా వెంకట్రావు - కళా వెంకట్రావు
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు హితవు పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదలై 24 గంటలైనా కాకముందే మళ్లీ అరెస్ట్ చేయటం దారుణమన్నారు. వెంటనే జేసీని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
tdp president kala venkata rao f