సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని దళితులపై జరుగుతున్న వర్ణ వివక్ష, అన్యాయాలను ప్రశ్నించిన అభ్యుదయవాది గుర్రం జాషువా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఆ కళాప్రపూర్ణుడి సంఘ సంస్కరణ పోరాటాన్ని, ఆ నవయుగ కవి చక్రవర్తి సాహితీ సేవను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. తనను అంతం చేసినా.. తన ఆశయాలను అంతమొందించలేరని ఆనాడు భగత్‌సింగ్ చెప్పినట్టుగా, ఆ దేశభక్తుని వీరగాధ తరతరాలకు ప్రేరణ అందిస్తూనే ఉందన్నారు. భరతమాత ప్రియపుత్రుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా, ఆయన త్యాగాన్ని, ఆశయాలను, చిత్తశుద్ధిని ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా తీసుకుందామని చంద్రబాబు ఆకాంక్షించారు.
CHANDRABABU: 'భగత్‌సింగ్, గుర్రం జాషువాల స్ఫూర్తితో పయనిద్దాం' - Chandrababu responds to Bhagat Singh Jayanti
దళితుల అభ్యునతి కోసం సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. నేడు భరతమాత ప్రియపుత్రుడు భగత్ సింగ్, గుర్రం జాషువాల జయంతి సందర్భంగా వారి త్యాగాలు, ఆశయాలను స్మరించుకున్నారు.
chandrababu