ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా నేతల ధనదాహానికి.. కార్మికులు బలవుతున్నారు : చంద్రబాబు - shantipuram quarry

చిత్తూరు జిల్లా శాంతిపురం క్వారీలో జరిగిన పేలుడుకు.. అక్రమ మైనింగే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనలో మృతిచెందిన కార్మికుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Dec 29, 2021, 7:04 PM IST

వైకాపా నేతల ధనదాహానికి కార్మికులు బలవుతున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్ వల్లే శాంతిపురం క్వారీలో పేలుడు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కార్మికుడు చనిపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పేలుడు కారణంగా మృతి చెందిన గోవిందప్ప కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వారీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు.

ఇదీ ప్రమాదం..
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కోనేరు కుప్పం వద్ద ఉన్న ఓ క్వారీలో ప్రమాదం జరడంతో.. గోవిందప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details