ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సత్తుపల్లిలో వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు - అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహం

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

tdp-president-chandrababu-naidu-attended-telangana-mla-mecha-nageshwara-rao-sons-wedding
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వివాహ వేడుకకు హాజరైన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు

By

Published : Feb 12, 2020, 5:31 PM IST

సత్తుపల్లిలో వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు

తెలంగాణలోని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు వస్తున్నారనే విషయం తెలుసుకొని సత్తుపల్లి, వేంసూరు, అశ్వరావుపేట నుంచి పెద్దఎత్తున తెదేపా అభిమానులు, కార్యకర్తలు వివాహ వేడుక వద్దకు చేరుకున్నారు. తెదేపా అధినేతకు ఘనస్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ వివాహ వేడుకలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నందమూరి సుహాసిని, దెందులూరు మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీమంత్రి జవహర్, మాజీఎమ్మెల్యే కొత్తకోట దయాకర్​రెడ్డి, తెలంగాణ రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details