రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు.. పంట అమ్మకాలకు వస్తున్నాయా.. అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోందని విమర్శించారు. కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోయటం ఎంతో బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటీ దారుణం అంటూ సంబంధిత వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.
'మద్యం అమ్మకాలకు నిబంధనల్లేవ్.. పంటల అమ్మకానికి ఎందుకు..?' - chandrababu comments on farmers crop news
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులు పంట అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించలేకపోతుందని మండిపడ్డారు.

'మద్యం అమ్మకాలకు నిబంధనల్లేవ్.. పంటల అమ్మకానికి ఎందుకు..?'
ఇదీ చూడండి..
TAGGED:
chandrababu crops tweet