ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక మాయంలో మంత్రిని ఎందుకు అరెస్టు చేయరు..?: చంద్రబాబు - tdp candle rally news

11 కేసుల్లో అవినీతిలో కూరుకుపోయిన సీఎం జగన్‌... అవినీతిని ప్రక్షాళన చేస్తాననడం హాస్యాస్పదమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జరగని అవినీతిని జరిగినట్లుగా చూపించి.... బలహీన వర్గానికి చెందిన అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన జగన్‌.... 2లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక మాయమైపోయిందన్న మంత్రి పెద్దిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయరని నిలదీశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వమని తేల్చి చెప్పారు.

ఇసుక మాయంలో మంత్రిని ఎందుకు అరెస్టు చేయరు..?: చంద్రబాబు
ఇసుక మాయంలో మంత్రిని ఎందుకు అరెస్టు చేయరు..?: చంద్రబాబు

By

Published : Jun 15, 2020, 2:40 AM IST

తెదేపా నేతల అరెస్టుకు నిరసనగా కాగడాల ప్రదర్శన

పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ తెలుగుదేశం నేతలు.... రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అరెస్టులను నిరసిస్తూ పలు చోట్ల బీసి సంఘాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి.... గాంధీ, అంబేడ్కర్, పూలె, ఎన్టీఆర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. అధ్యక్షుడి పిలుపు మేరకు జిల్లాల్లో కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు. అమరావతి ఉండవల్లిలోని తన నివాసంలో చేపట్టిన ప్రదర్శనలో అధినేత చంద్రబాబు, వర్ల రామయ్య, బొండా ఉమ ఇతర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెదేపా నాయకులే లక్ష్యంగా జగన్‌ దాడులు చేయిస్తున్నారని, బెదిరించి లొంగదీసుకుంటున్నారని మండిపడ్డారు. మాటవినని నేతలను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారన్నారు. ఏదో విధంగా తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే జగన్‌ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

అభివృద్ధి ఏదీ..?

సీఎం జగన్​పై చంద్రబాబు విమర్శలు

ఏడాది వైకాపా పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పితే.... మచ్చుకైనా అభివృద్ధి కనపించడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక, మద్యం, సాక్షికి ప్రకటన కేటాయింపు, మైనింగ్‌, సరస్వతి సిమెంట్‌ కంపెనీకి 50 ఏళ్లు లీజు వంటి అంశాలపై.... సీబీఐ విచారణ వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనులను న్యాయస్థానాలు తప్పు పడుతున్నా.... వాటికి సమాదానాలు చెప్పకుండా ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, దాడులకు పాల్పడి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు.

అచ్చెన్నాయుడు, జెసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ల అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 222 మండల కేంద్రాలు, 310 గ్రామాల్లో తెదేపా నాయకులు కాగడాలు, కొవ్వొత్తులతో నిరసనలు తెలియజేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 44 మందితో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీల బాధ్యులు 4 వేల 200 మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు. నెల్లూరులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఇదీ చూడండి ..

గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు తెదేపా ఆర్థిక సాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details