రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో విమర్శించింది. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన పొలిట్‌బ్యూరో.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించింది.
ఆలయాలపై దాడుల మీద సీబీఐ విచారణకు ఆదేశించాలి: తెదేపా పొలిట్‌బ్యూరో - tdp fires on cm jagan
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. సీఎం, హోం మంత్రి, డీజీపీల పర్యవేక్షణలోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయనే ప్రచారం ఉందని.. హిందూ ధర్మంపై ప్రభుత్వమే దాడులు జరుపుతోంటే ఎవరికి చెప్పాలని పొలిట్ బ్యూరో సభ్యులు అన్నారు. దేవాలయాలపై దాడులు అంశమే ప్రధాన అజెండాగా..తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం దాదాపు 4గంటల పాటు సాగింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు హిందూమతంపై ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రభుత్వం మాత్రం అలాంటి జాగ్రత్తలేవీ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎందుకు నోరుమెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలోనూ ఈ స్థాయిలో ఆలయాలపై దాడులు జరగలేదన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు.
ఇదీ చదవండి: పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు..?