ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని తెదేపా పొలిట్‌బ్యూరో తీర్మానం - నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని తెదేపా పొలిట్‌బ్యూరో తీర్మానం

ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు తీర్మానించారు. ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇతర దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని కోరారు.

tdp politburo meting in ap
tdp politburo meting in ap

By

Published : Apr 9, 2020, 5:12 PM IST

ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని తెదేపా పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం నిర్వహించిన తెదేపా అధినేత చంద్రబాబు, సభ్యులు ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ధరల స్థిరీకరణ నిధి అమలుచేసి రైతులను ఆదుకోవాలని.. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి కూలీలు, పేదలను ఆదుకోవాలని కోరారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ ఎంతో ఉపయోగపడుతోందని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని తెదేపా డిమాండ్ చేసింది. పేదలు, రైతులు కరెంట్, నీటి బిల్లులు రద్దు చేయాలని కోరింది. ఇతర దేశాలు, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. వారంతా స్వస్థలాలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందికి పీపీఈలు అందించాలన్న తెదేపా... నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌రావు సస్పెన్షన్‌ను ఖండించింది.

ABOUT THE AUTHOR

...view details