Varla Ramaiah on Gautam Sawang transfer: అధికారుల పట్ల జగన్ రెడ్డి వాడి పారేసే విధానం మరోసారి బయటపడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ ప్రకాష్, అజయ్ కల్లం, పీవీ రమేష్‌లను కూడా వాడుకుని విసిరేశారని మండిపడ్డారు. మాజీ డీజీపీ సవాంగ్‌ను అన్న అంటూ పిలిచి, కరివేపాకులా వాడుకొని తీసేశారని ఎద్దేవా చేశారు. ఐపీసీ రూల్స్ పక్కనపెట్టి మరీ జగన్ కోసం గౌతమ్ సవాంగ్ పని చేశారని వ్యాఖ్యానించారు. గౌతమ్ సవాంగ్ వ్యవహారం అధికారులకు గుణపాఠం కావాలని హితవు పలికారు. సీఎం జగన్ కోసం ఎగిరెగిరిపడినా పాపం పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు.
సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా...
Ap Dgp Gautam Sawang Transfer: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. విశాఖపట్నం, విజయవాడ పోలీస్‌కమిషనర్‌గానూ రాజేంద్రనాథ్‌రెడ్డి పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగానూ ఆయన సేవలందించారు. మరోవైపు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని గౌతమ్ సవాంగ్‌ను సర్కార్ ఆదేశించింది. 2023 జులై వరకు సవాంగ్‌కు పదవీకాలం ఉన్నప్పటికీ ఈలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి