ఎంపీ విజయసాయిరెడ్డి తన అధికారంతో మాన్సాస్ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఉపకార వేతనాలు, బోధనా రుసుములు త్వరితగతిన ఇప్పించాలని తెదేపా నేత అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో రెండవ స్థానం కలిగిన విజయసాయి మాన్సాస్ ట్రస్టుపై స్పందించడం సంతోషకరమంటూ ట్వీట్ చేశారు.
'మాన్సాస్ ట్రస్టుపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించటం సంతోషకరం' - మాన్సాస్ ట్రస్టుపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందన
మాన్సాస్ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వేతన బకాయిలు ఇప్పించేలా ఎంపీ విజయసాయిరెడ్డి కృషి చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు తెలిపారు. మాన్సాస్ ట్రస్టుపై విజయసాయిరెడ్డి స్పందించటం సంతోషదాయకం అన్నారు.
!['మాన్సాస్ ట్రస్టుపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించటం సంతోషకరం' TDP leader Ashok Gajapatiraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12238599-338-12238599-1624454772899.jpg)
తెదేపా నేత అశోక్ గజపతిరాజు